logo

అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి

రాష్ట్ర అవతరణ దిన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అవతరణ దినోత్సవ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో

Published : 24 May 2022 00:46 IST

మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి మోతీలాల్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దిన వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి మోతీలాల్‌ కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో అవతరణ దినోత్సవ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ పోలీసు మైదానంలో వేడుకలను నిర్వహిస్తామని వీటికి శాసన సభా ఉప సభాపతి టి.పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. వేడుకలను ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. వివిధ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవోలు అశోక్‌కుమార్‌, విజయకుమారి, ఏఎస్పీ రషీద్‌, ముఖ్య ప్రణాళికాధికారి నిరంజన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు రాజేశ్వర్‌, వేణుమాధవరావు, చక్రపాణి, తహసీల్దారు షర్మిల పాల్గొన్నారు.

ప్రతి దరఖాస్తులో పేదవాడి ముఖాన్ని చూడాలి

ప్రతి దరఖాస్తులో పేదవాడి బాధాతప్త హృదయంతో కూడిన ముఖాన్ని చూసి స్పందించాలని అదనపు పాలనాధికారి మోతీలాల్‌ అన్నారు.  సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఆయనకు జిల్లా అధికారులు, రేషన్‌ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు కోటాజి, కృష్ణన్‌, జానకిరెడ్డి, నిరంజన్‌రావు, లలితకుమారి, రేణుకాదేవి, గోపాల్‌, హనుమంతరావు, బాబుమోజెస్‌, దశరథ్‌, రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు బాలేశ్వర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని