logo

కళాశాలల్లో వెయ్యి పోస్టుల భర్తీకి అంగీకారం

కళాశాల విద్యను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులనూ

Published : 24 May 2022 02:35 IST

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న నవీన్‌ మిత్తల్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: కళాశాల విద్యను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వెయ్యి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులనూ క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ‘జిజ్ఞాస’ స్టూడెంట్‌ స్టడీ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథి నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ...  విద్యార్థులు సృజనాత్మక, వినూత్నమైన ఆలోచనలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు. కాలేజియెట్‌ ఎడ్యుకేషన్‌ ఏజీవో తిరువెంగలాచారి, రూసా అధికారిణి సౌందర్యజోసెఫ్‌, సీసీ ఇన్‌ఛార్జి సురేష్‌, డా.రాకేశ్‌ భవాని, వెంకటేశ్వర్లు, భవాని, రచన, వాసుదేవ్‌, పుష్ప, సూర్యనారాయణలు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని