logo

నూతన విధానాల అమలుతోనే ఉద్యోగాల వృద్ధి

నూతన విధానాలను అమల్లోకి తీసుకురావడం ద్వారానే ఉద్యోగాల వృద్ధిని సాధించవచ్చని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ సంతోష్‌ మెహరోత్రా అన్నారు. ఆజాదీకా అమృత్‌

Published : 24 May 2022 02:35 IST

సంతోష్‌ మెహరోత్రా

అమీర్‌పేట, న్యూస్‌టుడే: నూతన విధానాలను అమల్లోకి తీసుకురావడం ద్వారానే ఉద్యోగాల వృద్ధిని సాధించవచ్చని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ సంతోష్‌ మెహరోత్రా అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) ఆవరణలో సోమవారం ‘రివర్సింగ్‌ స్ట్రక్చరల్‌ రెట్రోగ్రేషన్‌ అండ్‌ జాబ్‌లెస్‌నెస్‌ ఇన్‌ ఇండియన్‌ ఎకానమీ, ద రోల్‌ అండ్‌ కాంపోనెంట్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ’ అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన సంతోష్‌ మెహరోత్రా మాట్లాడుతూ.. విధానపరమైన వైఫల్యాలతోనే భారతదేశం ప్రస్తుతం నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. గత కొన్నేళ్లలో 15-29 మధ్య వయసున్న యువత రేటు 6.1 నుంచి 17.8 శాతానికి పెరగడంతో, కొలువుల కోసం ఎదురుచూసే వారి సంఖ్య కూడా అధికమైందన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పలురకాల ప్రత్యామ్నాయాలను వివరించారు.  కార్యక్రమానికి సెస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ దిలీప్‌ ఎం నచనే అధ్యక్షత వహించగా, సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని