logo

ఫ్యాన్లు లేవు.. ఉక్కపోత తప్పదు!

ఫ్యాన్లు సరిగా లేవు..దుమ్ము కొట్టుకున్న బెంచీలతో అవస్థల మధ్య పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 937 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 1,65,644 మంది విద్యార్థులు హాజరు

Published : 24 May 2022 03:09 IST

పది పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల అవస్థలు 

తొలిరోజు ప్రశాంతం, 1639 మంది గైర్హాజరు

సీతాఫల్‌మండీలో వాహనంపై చదువుకుంటున్న యువతి

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్యాన్లు సరిగా లేవు..దుమ్ము కొట్టుకున్న బెంచీలతో అవస్థల మధ్య పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 937 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 1,65,644 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా..1,64,005 మంది హాజరయ్యారు. 1639 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 

సికింద్రాబాద్‌ కీస్‌ హైస్కూల్‌లో కుమార్తెతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కుటుంబం

అపరిశుభ్రత నడుమే.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మున్సిపల్‌ సిబ్బంది ముందుకు రాకపోవడంతో పాఠశాలల గదులు శుభ్ర పడలేదు. ఉదయం 8 గంటల ముందు గదులు శుభ్రం చేయడం కనిపించింది. నెల రోజులుగా పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో మూతపడి బెంచీలు దుమ్ముకొట్టుకుపోయాయి. వాటిని ముందుగానే శుభ్రం చేయాల్సి ఉండగా..మున్సిపల్‌, విద్యాశాఖల మధ్య సమన్వయలోపంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం సహా పలు ప్రైవేటు పాఠశాలల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయక విద్యార్థులు ఎండ వేడిమికి ఇబ్బందులు పడ్డారు. రాంకోఠిలోని అలెన్‌ స్కూల్‌లో ఫ్యాన్లు విరిగిపోయాయి. ప్రశ్నపత్రాలు తీసుకునేందుకు ఉదయం 7.30కే ఉపాధ్యాయులు వెళ్లినా 40 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చిందని టీచర్లు చెబుతున్నారు.


విజయనగర్‌ కాలనీ పరీక్ష కేంద్రానికి కాలు విరిగిన విద్యార్థిని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని