logo
Published : 24 May 2022 06:56 IST

హెచ్‌ఎండీఏ.. ఇక ఈ-ఆఫీస్‌

ఆన్‌లైన్‌లో దస్త్రాల పరిశీలన 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ఈ-ఆఫీస్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం నుంచి వీటిని అమలు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌వార్డు నుంచి కమిషనర్‌ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది అంతా ఆన్‌లైన్‌లోనే దస్త్రాల పరిశీలన... పరిష్కారం చేపట్టనున్నారు. నోట్‌ ఫైళ్లు సైతం ఈ-ఆఫీస్‌లోనే విభాగాలకు పంపనున్నారు. ఎలాంటి కాగితం వినియోగించకూడదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ మొత్తం ఏడు జిల్లాల పరిధిలో విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు, లేఅవుట్లు ఇతర కార్యకలాపాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇవన్నీ ఫైళ్ల రూపంలో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ అంతా టీఎస్‌-బిపాస్‌ ద్వారా జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవడం... పరిశీలించి అనుమతులు జారీ చేస్తున్నారు. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నారు. పెద్దఎత్తున కాగితం వినియోగం తగ్గి హెచ్‌ఎండీఏకు ఆదాతోపాటు పరోక్షంగా పర్యావరణానికి మేలు జరగనుంది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని