logo

Hyderabad: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచిలో అగ్నిప్రమాదం

నగరంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచ్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Published : 24 May 2022 04:22 IST

హైదరాబాద్‌: నగరంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచ్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు వెలువడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేశారు. అయితే ఈ ఘటనలో జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని