logo

శివారు పట్టణాల్లోనూ బస్తీ దవాఖానాలు

నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బస్తీ దవాఖానాలు రానున్నాయి. ప్రస్తుతం బస్తీ దవాఖానాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో శివారు మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని

Published : 25 May 2022 02:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బస్తీ దవాఖానాలు రానున్నాయి. ప్రస్తుతం బస్తీ దవాఖానాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో శివారు మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొవిడ్‌ మహమ్మారి ప్రబలడంతో వీటి ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 40 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

రెండు విడతలలో ఏర్పాటు.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 22 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తొలివిడతలో 11, రెండో విడతలో మరో 11 రానున్నాయి. ఇందులో పది బస్తీ దవాఖానాలు ఒక్క మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే బడంగ్‌పేట, మీర్‌పేట, జల్‌పల్లి, తుక్కుగూడ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో రానున్న బస్తీ దవాఖానాలను పీర్జాదిగూడ, బోడుప్పల్‌, నిజాంపేటలో రెండేసి చొప్పున.. మిగిలిన చోట్ల ఒక్కొక్కటి ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. వీటిని వచ్చే నెల 2లోగా ప్రారంభించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో భవనాల ఎంపిక పూర్తి కాలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారులు స్థలాల గుర్తింపు పూర్తి చేశారు. అక్కడ వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉన్నందున వచ్చే నెల 2లోగా ప్రారంభించడం అనుమానంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని