logo

విశ్రాంత ప్రొఫెసర్‌ నీరదారెడ్డి కన్నుమూత

విశ్రాంత ప్రొఫెసర్‌ నీరదారెడ్డి (84) మంగళవారం ఉదయం కన్నుముశారు. అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ తిప్పారెడ్డి తదితరులు

Published : 25 May 2022 02:45 IST

శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: విశ్రాంత ప్రొఫెసర్‌ నీరదారెడ్డి (84) మంగళవారం ఉదయం కన్నుముశారు. అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ తిప్పారెడ్డి తదితరులు.. నీరదారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు వైస్‌ ఛైర్మన్‌గా, 1999-2000 సంవత్సరంలో ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి ఛైర్మన్‌గా నీరదారెడ్డి విధులు నిర్వహించారు. 1959-1960 కాలంలో ఉస్మానియాలో విద్యనభ్యసిస్తున్న సమయంలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో ఆర్ట్స్‌ కాలేజీ ఛాంపియన్‌గా నిలిచారు. ఆమె భర్త మల్లారెడ్డి 1992-1995 మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్శిటీ వీసీగా విధులు నిర్వహించారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రమోద్‌రెడ్డి న్యాయవాది, రెండో కుమారుడు పవన్‌రెడ్డి వైద్యుడు. భర్త మల్లారెడ్డి 2008లో మృతిచెందారు.

‘విద్యారంగానికి తీరని లోటు’
ఆచార్య నీరదారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల మంత్రి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు ఆచార్య వెంకట రమణ.. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని