logo

తెలుగు వైద్యునికి యూకే పార్లమెంటు అవార్డు

చిన్నపిల్లల్లో ఆటిజం, హైపరాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ) సమస్యలపై పరిశోధనలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని రచించిన డాక్టర్‌ ఏఎంరెడ్డికి యూకే పార్లమెంట్‌ అవార్డు దక్కింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు.

Published : 25 May 2022 02:45 IST

అవార్డు స్వీకరిస్తున్న డాక్టర్‌ ఏఎం.రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నపిల్లల్లో ఆటిజం, హైపరాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ) సమస్యలపై పరిశోధనలు చేయడంతో పాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని రచించిన డాక్టర్‌ ఏఎంరెడ్డికి యూకే పార్లమెంట్‌ అవార్డు దక్కింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆటిజంపై తాను రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. గత పదేళ్లలో దాదాపు 143 ఆటిజం కేసులపై పరిశోధనలు చేసిన ఆయన ‘గర్భం సమయంలో మందులు ఎక్కువగా వాడటమే.. పిల్లల్లో ఆటిజం, హైపరాక్టివిటికీ ప్రధాన కారణమని తేలిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మానసిక జబ్బులకు హోమియోపతిలో విజయవంతంగా చికిత్స అందించవచ్చన్నారు. ఆ అనుభవాలన్నీ కలిసి ఈ పుసక్తంరాసినట్లు వివరించారు. ఇండియన్‌ ఎంబీసీ సిబ్బంది, యూకే పార్లమెంట్‌ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని