logo

ఐఎస్‌బీకి ప్రధాని రాక.. ట్రాఫిక్‌ మళ్లింపు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26న ఇండియన్‌ స్కూల్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను సందర్శిస్తున్న సందర్భంగా పలు ట్రాపిక్‌ మార్గదర్శకాలు అమలుచేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 25 May 2022 02:45 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26న ఇండియన్‌ స్కూల్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ను సందర్శిస్తున్న సందర్భంగా పలు ట్రాపిక్‌ మార్గదర్శకాలు అమలుచేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5వరకు అమలులో ఉంటాయన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ మధ్య, ట్రిపుల్‌ ఐటీ కూడలి నుంచి విప్రో జంక్షన్‌ వరకు ఉండే కార్యాలయాల ఉద్యోగులు ఆ దారుల్లో రాకపోకలు సాగించకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. లేనిపక్షంలో వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాలని కోరారు.

ప్రత్యామ్నాయ మార్గాలివీ.. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి లింగంపల్లి వైపునకు.. గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద కుడి మలుపు తీసుకుని బొటానికల్‌ గార్డెన్‌కు అక్కడ ఎడమ వైపు తిరిగి కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, మసీదు బండ కమాన్‌ మీదుగా హెచ్‌సీయూ డిపో వద్దకు చేరుకుని లింగంపల్లి రోడ్డులో వెళ్లాలి. ఇటువైపు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనదారులు అదే మార్గాన్ని అనుసరించాలి.ః విప్రో కూడలి నుంచి లింగంపల్లికి.. విప్రో కూడలి నుంచి క్యూసిటీ, గౌలిదొడ్డి గ్రామం, గోపన్‌పల్లి చౌరస్తా, అక్కడ కుడి మలుపు తీసుకుని హెచ్‌సీయూ వెనుక గేటు, నల్లగండ్ల మీదుగా ఉన్న మార్గంలో వెళ్లాలి. ః విప్రో నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వైపునకు.. విప్రో నుంచి ఇటు ఫెయిర్‌ ఫీల్డ్‌ హోటల్‌, బైపాస్‌ రోడ్డు, నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ రోటరీకి అక్కడ ఎడమ వైపు మళ్లి ఓఆర్‌ఆర్‌పై ఎల్‌అండ్‌టీ టవర్స్‌ మీదుగా చేరుకోవాలి. ః మాదాపూర్‌ వేలాడే వంతెన నుంచి గచ్చిబౌలి కూడలికి.. వేలాడే వంతెన అప్‌ ర్యాంపు వద్ద మలుపు తీసుకుని, రోడ్‌ నం.45, రత్నదీప్‌, మాదాపూర్‌ ఠాణా, సైబర్‌ టవర్స్‌, హైటెక్స్‌, కొత్తగూడ, బోటానికల్‌ గార్డెన్‌ మీదుగా రావాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని