logo

బాలికను గర్భవతిని చేసిన ప్రైవేటు ఉద్యోగి అరెస్టు

బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసి మోసగించిన ఘటన షాబాద్‌ మండల పరిధిలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది.

Updated : 25 May 2022 06:10 IST

షాబాద్‌: బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసి మోసగించిన ఘటన షాబాద్‌ మండల పరిధిలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. వివాహితుడైన మాదెపురం రాజు(25) గత ఏడాది నవంబరులో ఆమెను పరిచయం చేసుకున్నాడు. అతను అమెజాన్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. బాలిక పాఠశాలకు వెళ్లే క్రమంలో కలుస్తూ, మాయ మాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక శరీరంలో మార్పులురావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, ఆరు నెలల గర్భవతి అని తేలింది. కుటుంబ సభ్యులు గట్టిగా మందలించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిందితుడికి భార్య, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు.
విద్యార్థినులను వేధించిన డ్రైవర్‌..
ఈనాడు, హైదరాబాద్‌: బాలికలను వేధించిన రాపిడో డ్రైవర్‌ పి.విజయ్‌కుమార్‌ అలియాస్‌ సన్నీ(25)ను మంగళవారం నగర షీ టీమ్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని కళాశాల వసతి గృహంతో ఉంటూ చదువుకుంటున్న 8 మంది విద్యార్థినుల ఫోన్‌ నంబర్లకు అర్ధనగ్న ఫొటోలు చేరాయి. ఒకే మొబైల్‌ నంబరు నుంచి వచ్చిన అశ్లీల ఫొటోలను చూసి విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై బాధితులు గత నెల 15న షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కళాశాలకు వెళ్లి విద్యార్థినుల నుంచి సమాచారం సేకరించారు. వాటి ఆధారంగా నిందితుడు బోరబండ పాండునగర్‌కు చెందిన రాపిడో డ్రైవర్‌ విజయ్‌కుమార్‌ అని గుర్తించారు. విద్యార్థినులను వేధించినట్టు అంగీకరించటంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని