logo

27న ఎల్బీ స్టేడియంలో ‘యోగా మహోత్సవ్‌’

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్‌ పి.రవికిషోర్‌ తెలిపారు. కేంద్ర ఆయుష్‌ శాఖ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు

Published : 25 May 2022 04:20 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్‌ పి.రవికిషోర్‌ తెలిపారు. కేంద్ర ఆయుష్‌ శాఖ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు, తెలంగాణ రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 27న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నాయని మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రవికిషోర్‌ ప్రకటించారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ యోగ, ఆధ్యాత్మిక సంస్థలు ఈనెల 27న ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 గంటల నుంచి ‘యోగా మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు కౌంట్‌డౌన్‌గా ఒక్కోరోజు ఒక్కో ప్రదేశంలో ఈ మహోత్సవాలు ఉంటాయని ప్రకటించారు. నిర్వహణ కమిటీ ప్రతినిధులు డి.సత్యారెడ్డి, ఎన్‌.కృపాకర్‌, సాయిచక్రవర్తి, అనంతలక్ష్మి, ఎం.సాయి చక్రవర్తి, బ్రహ్మకుమారీ సిస్టర్‌ ప్రశాంతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని