logo

నిర్దిష్ట గడువులోగా ఈపీఎఫ్‌ సొమ్ము చెల్లించాల్సిందే

123 సంవత్సరాల చరిత్ర కలిగిన బషీర్‌బాగ్‌లోని పీజీ న్యాయ కళాశాలను బషీర్‌బాగ్‌ నుంచి ఎత్తివేసి వర్సిటీలోని న్యాయశాస్త్ర విభాగంలో విలీనం చేయనున్నారా..! దీనిపై రెండురోజుల కిందట  వర్సిటీ పాలకమండలి సమావేశంలో కీలక చర్చ నడిచింది.

Published : 25 May 2022 04:20 IST

జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాలు, కాంట్రాక్ట్‌ కార్మికులకు చెందిన ఎంప్లాయిమెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) సొమ్మును నిర్దిష్ట గడువులోగా చెల్లించాల్సిందేనంటూ జీహెచ్‌ఎంసీకి హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లింపుల్లో జాప్యానికి నష్టంతో పాటు వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఈమేరకు పీఎఫ్‌ సహాయ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. 2012 మే నుంచి 2019 జూన్‌ కాలానికి స్వయంసహాయక సంఘాలు, కాంట్రాక్ట్‌ కార్మికుల ఈపీఎఫ్‌ బకాయిల చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి రూ.3.97 లక్షలు నష్టపరిహారం, వడ్డీ కింద రూ.4.81 లక్షల చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు, జప్తు ఆదేశాలను సవాలు చేస్తూ జీహెచ్‌ఎంసీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.విచారించిన జస్టిస్‌ జి.రాధారాణి ఇటీవల తీర్పు వెలువరించారు. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగుల సామాజిక భద్రత నిమిత్తం ప్రభుత్వం ఈపీఎఫ్‌ చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం కింద ఉద్యోగుల వేతనం నుంచి మినహాయింపుతో పాటు యజమాని వాటాను ఖాతాకు జమ చేయాల్సి ఉందని స్పష్టంచేశారు. పనిచేసిన నెల ముగిశాక వచ్చే నెలలో 15వ తేదీలోగా ఈపీఎఫ్‌ మొత్తాన్ని జమ చేయాల్సిఉందని, ఉద్యోగి పనిచేసిన తరువాత జరిపే చెల్లింపుల నుంచే మినహాయింపు ఉంటుందని, పదవీ విరమణ తరువాత ఇబ్బందుల్లేకుండా జీవించడానికి వీలుగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈపీఎఫ్‌ మొత్తాన్ని నిర్దిష్ట గడువులోగా చెల్లించాల్సిందేనని చట్టం స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ తీవ్ర నష్టాల్లో ఉందని, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అవసరం లేకున్నా పీఎఫ్‌ ఈపీఎఫ్‌ అమలు చేస్తున్నామన్న వాదనను తోసిపుచ్చారు. అప్పీలు చేసుకోవడానికి తగిన గడువు ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుతం ఆ గడువు కూడా ముగిసిపోయినందున పీఎఫ్‌ సహాయ కమిషనర్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించలేదంటూ జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని