logo

నిఘా లేక.. దగా పరీక్ష

గ్రేటర్‌ వ్యాప్తంగా అనుమతులు లేని డయోగ్నోస్టిక్‌ సెంటర్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంతో అలాంటి ల్యాబ్‌లను అధికారులు సీజ్‌ చేశారు. కొవిడ్‌ తర్వాత నిఘా కొరవడడంతో గల్లీకు రెండుమూడు పుట్టుకొచ్చాయి.

Published : 25 May 2022 04:32 IST

నగరంలో విచ్చలవిడిగా డయోగ్నోస్టిక్‌ కేంద్రాలు
కొవిడ్‌ తర్వాత పర్యవేక్షణ లేక అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా అనుమతులు లేని డయోగ్నోస్టిక్‌ సెంటర్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంతో అలాంటి ల్యాబ్‌లను అధికారులు సీజ్‌ చేశారు. కొవిడ్‌ తర్వాత నిఘా కొరవడడంతో గల్లీకు రెండుమూడు పుట్టుకొచ్చాయి. నగరంలో అధికారికంగా 1200 వరకు ల్యాబ్‌లు ఉన్నాయి. అనధికారంగా మరో ఆరేడు వందలు కొనసాగుతున్నట్లు అంచనా. శివార్లలో చిన్నగదుల్లోనే ఏర్పాటుచేస్తున్నారు. పెద్ద ల్యాబ్‌ల్లో కొన్నాళ్లు టెక్నీషియన్‌గా పనిచేసి అదే అనుభవంతో ఏర్పాటు చేస్తున్నారు. అరకొర జ్ఞానంతో ఫలితాలు విశ్లేషించి వీటిని అందిస్తున్నారు. కొన్నిసార్లు రోగం లేకపోయినా.. ఉన్నట్లు.. రోగం ఉన్నా సరే.. లేనట్లు నివేదికలు ఇస్తుండడంతో ప్రజల ప్రాణాలకే సంకటకంగా మారుతోంది. చార్మినార్‌, మెహిదీపట్నం, కార్వాన్‌, టోలిచౌకి, నాంపల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, బేగంపేట తదితరచోట్ల ఎక్కువగా ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు ఉన్నాయి. వీటికి ఆధారంగా విచ్చలవిడిగా ల్యాబ్‌లు పుట్టుకొస్తున్నాయి.

త్వరలో తనిఖీలు షురూ...
- డాక్టర్‌ వెంకటి, డీఎంఅండ్‌హెచ్‌వో, హైదరాబాద్‌

నగరంలో ఉన్న ప్రతి ప్రైవేటు డయోగ్నోస్టిక్‌ సెంటరు తప్పకుండా నమోదు చేయించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. త్వరలో డెకాయ్‌ ఆపరేషన్లు ప్రారంభించనున్నాం. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 55 ప్రభుత్వ డయోగ్నోస్టిక్‌ కేంద్రాలు ఉన్నాయి. 120కి పెంచనున్నాం. ప్రజలు ఈ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలి.
ఇవీ లోపాలు...
* ప్రతి డయోగ్నోస్టిక్‌ సెంటర్‌కు వైద్య ఆరోగ్యశాఖ అనుమతి తప్పనిసరి. ఎలాంటి పరికరాలు వాడుతున్నారు, నిపుణులు ఎంత మంది.. స్కానింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇవన్నీ పరిశీలించాకే అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం నగరంలో ఒకే ఒక్క టెక్నీషియన్‌తో నడుస్తున్న ల్యాబ్‌లు ఎన్నో. వీటిపై నిఘా ఉండటం లేదు.
* నినిబంధనల ప్రకారం తి కేంద్రంలో రికార్డుల నిర్వహణ పక్కగా ఉండాలి. కొన్ని పెద్ద పెద్ద ల్యాబ్‌లు తప్ప.. చిన్న చితకా ల్యాబ్‌లు ఈ రికార్డుల గురించి పట్టించుకోవడం లేదు.
* కొందరు ఒక ల్యాబ్‌కు అనుమతి తీసుకొని వాటి పేరుతో ఇంకా కొన్ని ఏరియాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కలెక్షన్‌ సెంటర్ల పేరుతో వాటిని అక్రమంగా నడుపుతున్నారు.
* ఫిజియోథెరపీ సేవా కేంద్రాలు ఇలానే లెక్కకు మిక్కిలి ఏర్పాటవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని