logo

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మండలస్థాయి కమిటీలు

నగరంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ

Published : 26 May 2022 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పూర్తిగా రెవెన్యూయేతర అధికారులే ఉండడం గమనార్హం. ప్రతి మండల స్థాయి కమిటీకి జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఒక్కో బృందం 250 దరఖాస్తుల్ని పరిష్కరించాలి. క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, ఆధారాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన ‘జీవో 58, 59 మొబైల్‌ యాప్‌’లో నమోదు చేస్తారు. వివరాలు కేవలం కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తాయి. మరోసారి వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఇతర శాఖల వారితో కమిటీలు ఏర్పాటు చేయడంపై రెవెన్యూ అధికారుల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది.


వేగంగా పరిష్కరించేందుకు కసరత్తు
- ఎల్‌.శర్మన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌

‘‘ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్‌ జిల్లాలో 16 మండలాలుండగా దరఖాస్తుల సంఖ్యను బట్టి 22 కమిటీలు ఏర్పాటు చేశాం. జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చినందుకు వాటిని వేగంగా పరిశీలించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని