logo

వేగానికి గొళ్లెం.. దూకుడుకు కళ్లెం

నగర రహదారులపై వేగంగా దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాలనీ రోడ్లు; రహదారులను విభాగినులు ఉన్నవి, లేనివి

Updated : 26 May 2022 05:57 IST

గ్రేటర్‌ రోడ్లపై వేగ పరిమితి ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: నగర రహదారులపై వేగంగా దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాలనీ రోడ్లు; రహదారులను విభాగినులు ఉన్నవి, లేనివి రెండుగా విభజించి వేగ పరిమితిని ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధన ప్రకారం డివైడర్‌ ఉన్న రోడ్లపై కార్లు గంటకు 60 కి.మీ., ఇతర వాహనాలు(గూడ్సు వాహనాలు, బస్సులు, మూడు చక్రాల బండ్లు) 50 కి.మీ. వేగాన్ని మించి వెళ్లడానికి వీల్లేదు. కాలనీ రోడ్లపై ఏ వాహనమైనా 30 కి.మీ. వేగం మించరాదు. ఒకవేళ ఉల్లంఘిస్తే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొత్త వేగ పరిమితి ఆధారంగా జీహెచ్‌ఎంసీ రహదారుల వెంబడి సూచికలు ఏర్పాటు చేస్తోంది. అనంతరం ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌ లేజర్‌ గన్లు ఏర్పాటు చేస్తారు. సూచికల్ని పట్టించుకోకుండా వేగంగా వెళ్తే జరిమానా విధించనున్నారు.

శాస్త్రీయంగా ప్రతిపాదనలు
ప్రస్తుతం అమలవుతున్న వేగ పరిమితి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. బల్దియా, హెచ్‌ఎండీఏ, రవాణా శాఖ అధికారులతో చర్చించి వన్‌ వే, టూ వే ఆధారంగా శాస్త్రీయ విధానంలో వేగ పరిమితి అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి రవాణా శాఖ అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని