logo

భద్రత చర్యల్లో నిర్లక్ష్యం.. ఉన్నతాధికారి ఆగ్రహం

రాజధానిలో వర్షాకాలం రాకముందే భద్రత పరిశీలన(సేఫ్టీ ఆడిట్‌) పూర్తి చేయాలన్న ఆదేశాలను పూర్తి చేయకపోవడంపై రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు

Published : 26 May 2022 02:32 IST

జీహెచ్‌ఎంసీ, జలమండలి, శివారు పురపాలికలకు హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో వర్షాకాలం రాకముందే భద్రత పరిశీలన(సేఫ్టీ ఆడిట్‌) పూర్తి చేయాలన్న ఆదేశాలను పూర్తి చేయకపోవడంపై రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు జలమండలి పరిధిలోని స్థానిక సంస్థలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్ర పురపాలక మంత్రి ఏప్రిల్‌ 5న జరిగిన సమీక్ష సమావేశంలో సేఫ్టీ ఆడిట్‌ గురించి అధికారులకు చేసిన సూచనలను  పూర్తి చేయలేదని పేర్కొన్నారు. నడిచే దారిలో, కాలిబాటలపై, రోడ్లపై, నాలాల పక్కన, కల్వర్టుల వద్ద నోళ్లు తెరుచుకుని ఉండే గోతులను పూడ్చడం లేదా బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచనలను ప్రతి అధికారి తప్పక పాటించాలని బుధవారం జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. అదేశాలను నిర్లక్ష్యం చేసిన యంత్రాంగంపై క్రమశిక్షణ చర్యలతోపాటు బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తుందని స్పష్టం చేశారు. ‘వర్షాకాలం సమీపిస్తున్నందున ఈనెల 27లోపు సేఫ్టీ ఆడిట్‌లో పాల్గొనే అధికారుల జాబితాను శాఖకు పంపాలి. జూన్‌ 5 నాటికి పరిశీలనతోపాటు, చేపట్టాల్సిన భద్రత చర్యలు పూర్తవ్వాలని’ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని