logo

వినియోగదారుడి విజయం

క్యారీ బ్యాగ్‌ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని స్పెన్సర్‌ రీటైల్‌ లిమిటెడ్‌ను హైదరాబాద్‌ రెండో వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది.

Published : 26 May 2022 02:32 IST

రూ.16 వేలు చెల్లించాలని స్పెన్సర్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: క్యారీ బ్యాగ్‌ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి తిరిగి చెల్లించే వరకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని స్పెన్సర్‌ రీటైల్‌ లిమిటెడ్‌ను హైదరాబాద్‌ రెండో వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. ఫిర్యాదీకి రూ.10 వేల నష్టపరిహారం, రూ.6 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కమిషన్‌ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు. లీగల్‌ మెట్రాలజీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ శాఖలు క్యారీ బ్యాగులకు అదనంగా వసూలు చేయకుండా సూపర్‌ మార్కెట్‌, షాపింగ్‌మాల్‌లకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. 2019 జూన్‌ 25న వి.ఆనందరావు ‘అమీరుపేట సూపర్‌’కు వెళ్ళారు. అక్కడ అదనంగా మూడు రూపాయలు కవర్‌ కోసం వసూలు చేసి లోగో ఉన్న కవర్‌ ఇచ్చారు. ‘అమీర్‌పేట సూపర్‌’ షాపు మూసివేసినా రెండో ప్రతివాది స్పెన్సర్‌ రిటైల్‌ లిమిటెడ్‌, ముషీరాబాద్‌ను ఇంప్లీడ్‌ చేసి వినియోగదారుల కమిషన్‌లో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని