logo

వాణిజ్య రంగంలో విస్తృత అవకాశాలు

వాణిజ్య రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం కాచిగూడలోని బద్రుకా వాణిజ్య కళాశాలలో నగరంలోని

Published : 26 May 2022 02:30 IST

లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న శ్రీకిషన్‌బద్రుకా తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: వాణిజ్య రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం కాచిగూడలోని బద్రుకా వాణిజ్య కళాశాలలో నగరంలోని 90 కళాశాలల నుంచి 3 వేల మంది విద్యార్థులు హాజరైన అంతర్‌ కళాశాలల ‘కామర్స్‌ ఫెస్ట్‌ త్రివిధ-2022’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బద్రుకా పూర్వ విద్యార్థి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీ సభ్యుడు, ఐసీఎస్‌ఐ 2020 మాజీ ఛైర్మన్‌ పాల్వాయి విక్రంరెడ్డి మాట్లాడుతూ..ప్రపంచీకరణతో విద్యారంగంలో నెలకొన్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. బద్రుకా విద్యా సంస్థల కార్యదర్శి శ్రీకిషన్‌బద్రుకా, డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ అభిరామకృష్ణ, ప్రిన్సిపల్‌ మోహన్‌కుమార్‌, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకటయ్య, సమన్వయకర్త లావణ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని