logo

డ్రగ్‌ను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

‘మెటాఫెటమైన్‌’ అనే మత్తు పదార్థాన్ని (డ్రగ్‌ను) విక్రయిస్తున్న ఇద్దరిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 గ్రాముల డ్రగ్‌ను, రెండు సెల్‌ఫోన్‌లను

Published : 26 May 2022 02:30 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘మెటాఫెటమైన్‌’ అనే మత్తు పదార్థాన్ని (డ్రగ్‌ను) విక్రయిస్తున్న ఇద్దరిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 గ్రాముల డ్రగ్‌ను, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ భూపతి గట్టుమల్లు వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజిగూడ జయలేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే విద్యార్థి మేకా అఖిల్‌ (22), దోమలగూడలోని వీధి నెంబరు 6లోని సత్తేపల్లి అపార్ట్‌మెంట్‌లో ఉండే గోవాలో చెఫ్‌గా పనిచేస్తున్న రోహిత్‌రెడ్డి (24) స్నేహితులు. వారం రోజుల క్రితం రోహిత్‌రెడ్డి నుంచి రూ.1500లకు ఒక గ్రాము చొప్పున మెటాఫెటమైన్‌ డ్రగ్‌ను అఖిల్‌ కొనుగోలు చేశాడు.  మంగళవారం సాయంత్రం ఇద్దరూ కలిసి హిమాయత్‌నగర్‌ వీధి నెంబరు 8లోని సేయింట్‌ అంథోని పాఠశాల వద్దకు వచ్చారు. గస్తీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు