logo

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌ మహానగర పరిధిలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన, నిర్వహణ, ఉపాధి కల్పనపై ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సూక్ష్మ, చిన్న,

Published : 26 May 2022 02:30 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ మహానగర పరిధిలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన, నిర్వహణ, ఉపాధి కల్పనపై ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు డీవీవీ శ్రీలక్ష్మివాణి తెలిపారు. బుధవారం ఆమె తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమం, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీషియన్‌ తదితర కోర్సులపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఆసక్తిగల మహిళలు నాంపల్లిలోని చేనేత భవన్‌లోని తమ సంఘం కార్యాలయంలో గానీ ఫోన్‌ 040-24651465, 9948662862లలో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని