నగరంలో 132 కేవీ.. శివార్లలో 220 కేవీ
నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్‌కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, ఫార్మా సంస్థల కార్యకలాపాలు ఊపందుకోవడంతో అక్కడ విద్యుత్తు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో 132 కేవీ, శివార్లలో (అవుటర్) 220 కేవీ ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. బౌరంపేటలో ఇప్పటికే 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పనులు పురోగతిలో ఉండగా, సీతారాంబాగ్‌లో కొత్తగా 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణం చేపట్టబోతుంది. అసిఫ్‌నగర్ నుంచి సీతారాంబాగ్ వరకు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు.
70 శాతానికి చేరితే..
విద్యుత్తు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్మించి నిర్వహిస్తోంది. ఇందుకోసం 400, 220, 132 కేవీ ఉప కేంద్రాలు నిర్మిస్తుంది. జెన్కో, ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్టెప్‌డౌన్ చేస్తూ ట్రాన్స్‌కో సరఫరా చేస్తుంది. ఉప కేంద్రాలపై లోడు 70 శాతానికి చేరితే.. కొత్త వాటి నిర్మాణంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం అసిఫ్‌నగర్ ఉప కేంద్రం లోడు 70 శాతానికి చేరిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు సీతారాంబాగ్‌లో కొత్తగా 132 కేవీ ఉప కేంద్రాన్ని నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు ఉపకేంద్రాల మధ్య ఆరు లేన్లలో అసిఫ్‌నగర్ నుంచి మెహిదీపట్నం మీదుగా సీతారాంబాగ్ వరకు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ కేబుళ్లు వేస్తారు. రద్దీగా ఉండే మెహిదీపట్నం రహదారి కింద 1.8 మీటర్ల లోతులో ఆరు కేబుళ్లు వేయనున్నారు. మెహిదీపట్నంలో ఇప్పటికే రహదారి తవ్వి వివరాలను సేకరించారు. పనుల వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఖర్చు తగ్గించేందుకు స్టోర్‌లోని కేబుల్‌నే వినియోగించనున్నారు. చివర్లో తగ్గితే అప్పుడు కొనుగోలు చేస్తామని ట్రాన్స్‌కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్ టి.జగత్‌రెడ్డి తెలిపారు.
మూడు విధాలుగా..
బౌరంపేటలో హైటెన్షన్ టవర్లు, మోనోపోల్స్, భూగర్భ కేబుళ్లు.. ఇలా మూడు విధాలుగా కేబుళ్లు వేస్తున్నారు. నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ మీదుగా బౌరంపేట వరకు దాదాపు 35 కి.మీ. దూరం ఉంటుంది. అవుటర్ దాకా హైటెన్షన్ టవర్ల ద్వారా దాదాపు 25 కిలోమీటర్లు ఓవర్ హెడ్ లైన్లు వేస్తున్నారు. అవుటర్ వెంట 5 కి.మీ. పొడవున మోనోపోల్స్ వేస్తున్నారు. తొలిసారి ఈ స్తంభాలను రాయదుర్గం 400 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం లైన్లలో వాడారు. ఇప్పుడు బౌరంపేటలో ఉపయోగిస్తున్నారు. అవుటర్ లోపల నుంచి బౌరంపేట వరకు మరో ఐదు కిలోమీటర్లు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. యూజీ కేబుల్ పనులు ఇప్పటికే 3 కి.మీ. పూర్తయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: అదుపులోనే మహమ్మారి.. కొత్త కేసులెన్నంటే..?
-
Business News
Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Related-stories News
Hacking: ఆన్లైన్ మార్కెట్లో 100 కోట్ల మంది డేటా!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..