logo

వడివడిగా క్రీడా మైదానాల గుర్తింపు: కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల వారీగా ఏర్పాటు చేయనున్న క్రీడా మైదానాలను అనువైన స్థలాల్లో గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని పాలనాధికారిణి నిఖిల పేర్కొన్నారు. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్‌,

Published : 26 May 2022 03:13 IST

అధికారులతో మాట్లాడుతున్న పాలనాధికారిణి

పూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల వారీగా ఏర్పాటు చేయనున్న క్రీడా మైదానాలను అనువైన స్థలాల్లో గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని పాలనాధికారిణి నిఖిల పేర్కొన్నారు. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్‌, మన్నెగూడ గ్రామాలను  బుధవారం ఆమె సందర్శించారు. మైదానాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ వివిధ రకాల ఆటల నిర్వహణకు మైదానాలను తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం మన ఊరు - మనబడిలో భాగంగా కడ్మూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు. జూన్‌ రెండు నాటికి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ కృష్ణన్‌, తహసీల్దారు కిరణ్‌, ఎంపీడీఓ ఉమాదేవి, డీఈ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని