logo

క్రీడల్లో మహిళల రాణింపు అభినందనీయం: ఎమ్మెల్యే

మహిళలు ఆటల్లో రాణించడం అభినందనీయమని, వీరు మరింత ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. జూన్‌ 7న తన పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజక వర్గ పరిధిలోని 30 క్లస్టర్లలో

Published : 26 May 2022 03:13 IST

క్రికెటర్లతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: మహిళలు ఆటల్లో రాణించడం అభినందనీయమని, వీరు మరింత ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. జూన్‌ 7న తన పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజక వర్గ పరిధిలోని 30 క్లస్టర్లలో ‘రోహిత్‌ అన్న యువ సేన’ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలకూ క్రికెట్‌ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫులే కళాశాల మైదానంలో బుధవారం మహిళలకు క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పురుషులకంటే ఉన్నతంగా మహిళలు ఎదగాలన్నారు. క్రీడా సామగ్రిని అందజేసి విజయకేతనాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు పట్లోళ్ల దీప, వ్యవసాయ విపణి అధ్యక్షుడు విఠల్‌ నాయక్‌, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయీం తదితరులున్నారు.  

స్వయం ఉపాధితో భవిష్యత్తుకు పునాది
స్వయం ఉపాధితో భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్‌ ఆటోను బుధవారం లబ్ధిదారుడు బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌ గ్రామానికి చెందిన తిరుపతయ్యకు అందజేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యువత సొంత కాళ్ల మీద నిలబడి జీవితంలో నిలదొక్కుకోవటానికి ఇలాంటి రాయితీలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని