Revanth Reddy: ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నాటకం.. వాళ్ల చీకటి బంధం ప్రజలకు తెలుసు: రేవంత్‌

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని రేవంత్‌ విమర్శించారు.

Updated : 26 May 2022 13:59 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని రేవంత్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నాటకమాడుతున్నాయని.. కానీ వాళ్ల చీకటి బంధం ప్రజలకు తెలుసన్నారు.

బహిరంగ లేఖలో 9 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి ప్రధాని సమాధానం చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు గురించి అవమానించేలా మోదీ మాట్లాడారని.. ఆ  వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. దాన్ని ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారని రేవంత్‌ ప్రశ్నించారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంతో జరుగుతున్న నష్టం, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మూసివేత, యాసంగి ధాన్యం కొనుగోలు, రామాయణం సర్క్యూట్‌లో భద్రాద్రికి చోటు కల్పించకపోవడం తదితర అంశాలపై రేవంత్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. వీటికి ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోదీకి రేవంత్‌ రాసిన బహిరంగ లేఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని