Hyderabad: షాపింగ్‌మాల్‌లో సీక్రెట్‌ కెమెరా పెట్టిన క్లీనింగ్‌ బాయ్‌..!

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వస్త్ర దుకాణంలోని బాత్‌రూంలో రహస్య కెమెరా పెట్టిన క్లీనింగ్‌ బాయ్‌..

Published : 27 May 2022 02:03 IST

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వస్త్ర దుకాణంలోని బాత్‌రూంలో రహస్య కెమెరా పెట్టిన క్లీనింగ్‌ బాయ్‌.. కొంత మంది మహిళల రహస్య చిత్రాలు సేకరించాడు. అయితే ఏడాది క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా బాధిత వస్త్ర దుకాణంలో పని చేస్తున్న సేల్స్ గర్ల్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రాలను ఇప్పుడు చూపించి వేధిస్తున్నట్లు సేల్స్‌ గర్ల్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుడి చరవాణి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని