Ktr in Davos: తెలంగాణలో హ్యుందాయ్‌ సంస్థ రూ.1,400 కోట్ల భారీ పెట్టుబడి

దావోస్ వేదికగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి దక్కింది. రాష్ట్రంలో రూ.1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ

Updated : 26 May 2022 18:22 IST

దావోస్‌: దావోస్ వేదికగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి దక్కింది. రాష్ట్రంలో రూ.1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుందాయ్ సీఐఓ యంగ్చోచి ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఎకో సిస్టమ్‌కు అవసరమైన ఇతర మౌలిక వసతులను కల్పించనున్నట్లు హ్యుందాయ్ సంస్థ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైన కూడా కేటీఆర్‌తో యంగ్చోచి చర్చించారు.

హ్యుందాయ్ పెట్టుబడి గొప్ప బలాన్నిస్తుంది: కేటీఆర్‌

రాష్ట్రంలో మొబిలిటీ రంగంలో హ్యుందాయ్ సంస్థ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్న కేటీఆర్‌.. అందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. రూ.1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. హ్యుందాయ్ రాకతో తెలంగాణకు మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని