Hyderabad metro: హైదరాబాద్‌ మెట్రో సేవల పునరుద్ధరణ

హైదరాబాద్‌ మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ వెళ్లే మెట్రో కారిడార్‌లో తాత్కాలికంగా రాకపోకలు...

Updated : 26 May 2022 19:25 IST

హైదరాబాద్‌: మియాపూర్‌ - ఎల్‌బీ నగర్‌ మెట్రో కారిడార్‌లో మెట్రో సేవలను అధికారులు పునరుద్ధరించారు. ఆ కారిడార్‌లో దాదాపు గంటపాటు నిలిచిపోయిన మెట్రో సేవలను ఎల్‌ అండ్ టీ మెట్రో అధికారులు పునరుద్ధరించారు. సాంకేతిక కారణాలతో నాంపల్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ నిలిచిపోవడంతో మియాపూర్‌ - ఎల్‌బీ నగర్‌ మెట్రో కారిడార్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. దీని వల్ల మిగతా కారిడార్లలో కూడా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌ మెట్రో రైళ్లు వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయి. మెట్రో సేవలకు తరచూ అంతరాయం ఏర్పడడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని