logo

35 నిమిషాలు ఆగిన మెట్రో రైలు

మెట్రో రైలు మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆగింది. గాలివాన బీభత్సం కొనసాగుతుండగానే గురువారం ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ బయల్దేరిన మెట్రో రైలు లక్డీకాపూల్‌ స్టేషన్‌కు ముందు నిలిచిపోయింది. సుమారు 35 నిమిషాలు ఆగింది.

Published : 27 May 2022 03:27 IST

వరుస సాంకేతిక సమస్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు


లక్డీకాపూల్‌ స్టేషన్‌లో ప్రయాణికుల నిరీక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలు మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆగింది. గాలివాన బీభత్సం కొనసాగుతుండగానే గురువారం ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ బయల్దేరిన మెట్రో రైలు లక్డీకాపూల్‌ స్టేషన్‌కు ముందు నిలిచిపోయింది. సుమారు 35 నిమిషాలు ఆగింది. లోపలున్న ప్రయాణికులకు బయట ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. రైలు ఆగినందుకు గల కారణాలను, ప్రయాణికుల భయాన్ని రైలు అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని ప్రయాణికులు వాపోయారు. రైలులోని ప్రకటనల సాయంతో కనీసం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదని ఓ ప్రయాణికురాలు ‘ఈనాడు’తో తెలిపారు. చివరకు రైలును నెమ్మదిగా ముందుకు నడిపించి 5గంటల 50 నిమిషాలకు అధికారులు రైలును లక్డీకపూల్‌ స్టేషన్‌కు చేర్చారు. రైలులో సమస్య నెలకొందన్న కారణం చెప్పి ప్రయాణికులను అక్కడే దించేశారు. కానీ అప్పటికే లక్డీకాపూల్‌ స్టేషన్‌ నిండా మియాపూర్‌ వైపు వెళ్లే ప్రయాణికులు పెద్దయెత్తున వేచి చూస్తున్నారు. రైలు రాగానే అధికారులు అందరినీ కిందకు పంపించారు. కొంత సమయానికి మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల క్రితం ముసారాంబాగ్‌లో ఓ రైలు సాంకేతిక సమస్యతో 20 నిమిషాలు ఆగిపోవడం తెలిసిందే. గురువారం నాటి ఘటనకు కారణం ఏంటనే అంశంపై మెట్రో రైలు అధికారులు రాత్రి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు