logo

రూ.వంద దాటేసిన టమాటా!

టమాటా ధర రికార్డు స్థాయికి ఎగబాకింది. రైతు బజార్లలో ఏప్రిల్‌ 5వ తేదీన కిలో టమాటా రూ.10కి దొరికితే నేడు అక్కడే రూ.55కు అమ్ముడవుతోంది. ఇక రిటైల్‌ వ్యాపారులైతే.. కిలో రూ.వందకు తగ్గించట్లేదు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా

Published : 27 May 2022 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: టమాటా ధర రికార్డు స్థాయికి ఎగబాకింది. రైతు బజార్లలో ఏప్రిల్‌ 5వ తేదీన కిలో టమాటా రూ.10కి దొరికితే నేడు అక్కడే రూ.55కు అమ్ముడవుతోంది. ఇక రిటైల్‌ వ్యాపారులైతే.. కిలో రూ.వందకు తగ్గించట్లేదు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్‌ మార్కెట్‌లో కిలో టమాటా రూ.125 బోర్డు పెట్టి అమ్ముతున్నారు. బీన్స్‌ కిలో రూ.159లు పలుకుతోంది.

మదనపల్లి నుంచి శ్రీలంకకు.. టమాటా నగరానికి వేసవిలో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ఎక్కువగా వచ్చేది. ఈ ఏడాది శ్రీలంక సంక్షోభంతో అక్కడికి ఎగుమతి అయిపోతోంది. రోజు 50 ట్రక్కుల వరకూ తీరప్రాంతానికి చేరుకుని లంకకు తరలిపోతోంది. 25 కేజీలున్న టమాటా ట్రే రూ.1300 నుంచి రూ.1400 వరకూ పంట పొలం దగ్గరే పలుకుతుండడంతో అక్కడి రైతులు మరో ప్రాంతం వైపు చూడడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని