logo

చిత్ర వార్తలు

వీరంతా వరద బాధితులో, నిరాశ్రయులో కాదు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగుల సంబంధికులు. లోపల రోగులు అనారోగ్యంతో ఇబ్బందిపడుతుంటే కొత్తగా నిర్మించిన షెడ్డులో చాలీచాలని స్థలంలో సతమతమవుతున్నారు. మరికొందరు ఓపీకి వచ్చి మరుసటి రోజు

Updated : 27 May 2022 03:43 IST

రోగంతో రోగులు.. వసతుల్లేక సంబంధికులు

వీరంతా వరద బాధితులో, నిరాశ్రయులో కాదు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగుల సంబంధికులు. లోపల రోగులు అనారోగ్యంతో ఇబ్బందిపడుతుంటే కొత్తగా నిర్మించిన షెడ్డులో చాలీచాలని స్థలంలో సతమతమవుతున్నారు. మరికొందరు ఓపీకి వచ్చి మరుసటి రోజు తిరిగి రాలేక రాత్రికి ఇక్కడే సేద తీరుతున్నారు. దోమలు అధికంగా ఉండడంతో నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు.


సంప్రదాయ తీరు.. నృత్యాల హోరు

డియల్‌ డిగ్రీ కళాశాల(దిల్‌సుఖ్‌నగర్‌) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువతులు ర్యాంప్‌పై ఫ్యాషన్‌షో నిర్వహించారు. సినిమా పాటలు, జానపద నృత్యాలతో హోరెత్తించారు.

- న్యూస్‌టుడే, రవీంద్రభారతి


ట్రీగార్డులు కరవాయె.. ముళ్లకంపలే దిక్కాయె!

మొక్కలు నాటగానే సరిపోదు.. వాటికి సంరక్షణ చర్యలూ అవసరమే. మొక్క దశలోనే అవి పాడవకుండా సాధారణంగా ఇనుప ట్రీగార్డులు ఏర్పాటు చేస్తుంటారు. అంతెందుకులే అనుకున్నారేమో.. ముళ్లకంప పెట్టి మమ.. అనిపించారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద కనిపించిన దృశ్యం.


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సెల్ఫీ పాయింట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల్ని ఆకట్టుకునే దిశగా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫారం వద్ద ‘ఐ లవ్‌ సికింద్రాబాద్‌’ సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేసింది. దేశం నలుమూలల నుంచి ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో స్టేషన్‌ ఆకర్షణీయంగా కనిపించేలా దీన్ని ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని