logo

కళ్లుండి లేనట్లు మాట్లాడుతున్నారు

రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో అందుతున్న వైద్యసేవలను విమర్శించే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అమీర్‌పేటలోని 50 పడకల ప్రభుత్వాసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు.

Updated : 27 May 2022 05:38 IST

సర్కారు వైద్యాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదు: మంత్రి హరీశ్‌రావు

బాలింతతో మాట్లాడుతున్న మంత్రులు తలసాని, హరీశ్‌రావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో అందుతున్న వైద్యసేవలను విమర్శించే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అమీర్‌పేటలోని 50 పడకల ప్రభుత్వాసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. హరీశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లోపించిందనడం విడ్డూరంగా ఉందన్నారు. వారు కళ్లుండి లేనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిని అభినందించిన విషయం మరచిపోయారా? అంటూ ప్రశ్నించారు. జహీరాబాద్‌ ఆసుపత్రిని చూస్తే తామేం చేశామో అర్థమవుతుందని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అని పాడుకునేవారని, ప్రస్తుతం సర్కారు ఆసుపత్రికే పోతామంటున్నారని చెప్పారు. వానాకాలంలో ఏజెన్సీ ప్రాంతాలు మంచం పట్టేవని, ఇప్పుడా పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. తాను జాబితా పంపుతానని, సర్కారు ఆసుపత్రులకు వెళ్లి ఎలా ఉన్నాయో చూడాలని వారికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని