logo

నీరజ్‌ పన్వర్‌ కుటుంబానికి అండగా నిలుస్తాం

నీరజ్‌ పన్వర్‌ కుటుంబానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని, హత్య కేసు నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హామీ ఇచ్చారు. బాధితుడి భార్య సంజన, వారి కుటుంబీకులు, మార్వాడీ సమాజ్‌కు చెందిన పలువురు

Published : 27 May 2022 03:53 IST

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ


అసదుద్దీన్‌ ఒవైసీతో నీరజ్‌ పన్వర్‌ భార్య సంజన, కుటుంబసభ్యులు

అబిడ్స్‌, న్యూస్‌టుడే: నీరజ్‌ పన్వర్‌ కుటుంబానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని, హత్య కేసు నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హామీ ఇచ్చారు. బాధితుడి భార్య సంజన, వారి కుటుంబీకులు, మార్వాడీ సమాజ్‌కు చెందిన పలువురు గురువారం దారుస్సలాంలోని ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో ఎంపీని కలిశారు. నీరజ్‌ హత్య కేసులోని నిందితులు, వారి కుటుంబీకులతో తమకు ప్రాణహాని పొంచి ఉందని అసదుద్దీన్‌కు విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి కేసు పూర్వాపరాలు, నిందితుల అరెస్టు విషయాల్ని అడిగి తెలుసుకొన్నారు.

త్వరలో ‘మాన్‌సూన్‌ సేఫ్టీ వాక్‌’

ఈనాడు- హైదరాబాద్‌: వర్షాకాలం నేపథ్యంలో ప్రజల భద్రత, రక్షణపై అవగాహన కల్పించేందుకు ‘మాన్‌సూన్‌ సేఫ్టీ వాక్‌’ నిర్వహించనున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్‌ ప్రకటించారు. భద్రతా వారోత్సవాలను జూన్‌ ఐదో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. జలమండలి ఈడీ, డైరెక్టర్లు, సీజీఎం, జీఎంలతో దాన కిశోర్‌ గురువారం టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘వానాకాలం దృష్ట్యా ప్రమాదాల్ని అరికట్టేందుకు సేఫ్టీ ఆడిట్‌ వెంటనే ప్రారంభించారు. మేనేజర్‌ నేతృత్వంలో బృందంగా ఏర్పడి పర్యటించాలి. మ్యాన్‌హోల్‌ మూత లేనివి, ధ్వంసమైనవి గుర్తించి కొత్తవి ఏర్పాటు చేయాలి’. అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని