logo

అమ్మకానికి ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయ స్థలం

నగరం నడిబొడ్డున ఆనంద్‌నగర్‌లోని ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు కొందరు యత్నించారు. సుమారు 200 గజాల విస్తీర్ణంలోని స్థలం

Published : 27 May 2022 04:05 IST


ఆనంద్‌నగర్‌ కాలనీలోని ఖైరతాబాద్‌ తహసిల్దార్‌ కార్యాలయం

పంజాగుట్ట, న్యూస్‌టుడే: నగరం నడిబొడ్డున ఆనంద్‌నగర్‌లోని ఖైరతాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు కొందరు యత్నించారు. సుమారు 200 గజాల విస్తీర్ణంలోని స్థలం తమదేనంటూ బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి పెట్టారు. గజం రూ.లక్ష పలుకుతున్న స్థలాన్ని కేవలం రూ.80వేలకే అమ్ముతామంటూ ప్రకటినలిచ్చారు. ఓ వ్యక్తి పేరిట నకిలీ దస్తావేజులు సృష్టించారు. దీంతో ఆసక్తి ఉన్నవారు కొద్ది రోజులుగా ప్రదేశాన్ని చూసి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆరుగురు వ్యక్తులు కొనేందుకు సిద్దపడి స్థలాన్ని చూసి వెళ్లారు. వచ్చిన వారిలో ఓ వ్యక్తికి అనుమానం వచ్చి ఆరా తీయగా స్థలం తహసీల్దారు కార్యాలయానిదని తెలిసి కంగుతిన్నారు. భూమిని పరిశీలించేందుకు నిత్యం ఎంతో మంది వచ్చిపోతున్నా, కార్యాలయ సిబ్బంది కనీసం గమనించక పోవడం విడ్డూరం. దీనిపై తహసీల్దార్‌ అన్వర్‌ హుస్సేన్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని