logo

రోబోటిక్‌ ఛాలెంజ్‌ పోటీల్లో.. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు ద్వితీయస్థానం

బెంగళూరు వేదికగా జరిగిన రోబోటిక్‌ ఛాలెంజ్‌ పోటీల్లో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ద్వితీయ స్థానం సాధించి రూ.2.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లోని ‘ఏఐ అండ్‌ రోబోటిక్స్‌

Published : 27 May 2022 04:05 IST

విద్యార్థుల బృందం

ఈనాడు, హైదరాబాద్‌: బెంగళూరు వేదికగా జరిగిన రోబోటిక్‌ ఛాలెంజ్‌ పోటీల్లో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ద్వితీయ స్థానం సాధించి రూ.2.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లోని ‘ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ టెక్నాలజీ పార్క్‌(ఆర్ట్‌ పార్క్‌) ఆధ్వర్యంలో రోబోటిక్‌ ఛాలెంజ్‌ పోటీలు నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీ తరఫున పరిశోధక విద్యార్థి సూరజ్‌ బోనగిరి నేతృత్వంలో వేదాంత మందెడ, కరణ్‌ మిరాఖోర్‌, రాహుల్‌ కశ్యప్‌, పి.శ్రీహర్ష, కర్ణిక్‌ రాం బృందం రోబోను తయారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని