logo

నగరంలో ప్రధాని మోదీ పర్యటన.. స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

మోదీ రాక కోసం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా వేచి చూశారు. సభావేదిక ముందు నీడ లేకపోవడంతో ఎండలోనే మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

Updated : 27 May 2022 06:36 IST

* బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి ప్రధాని మోదీ చేరుకోగానే కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

* మోదీ రాక కోసం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా వేచి చూశారు. సభావేదిక ముందు నీడ లేకపోవడంతో ఎండలోనే మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

* ‘పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలు’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించడంతో కార్యకర్తలు సానుకూలంగా స్పందించారు.  

* ప్రసంగం పూర్తయ్యే వరకు జైమోదీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. డప్పుల మోతలతో పార్టీ జెండాలను ఊపుతూ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించారు.

* కొందరు కార్యకర్తలు మోదీ మాస్కులు ధరించి ఆకట్టుకున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


స్వాగతం పలికిన కార్పొరేటర్లు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఐఎస్‌బీలో ప్రధాన మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి భాజపా కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పాసులు ఇప్పించారు. ఈ క్రమంలో 47 మంది ఐఎస్‌బీకి చేరుకున్నారు. వారిలో 23 మంది హెచ్‌సీయూ హెలిపాడ్‌ వద్దకు చేరుకుని వరుసగా నిల్చొని స్వాగతం పలికారు. మిగతా వారిని ఐఎస్‌బీలోకి¨ అనుమతించారు. ఐఎస్‌బీలో సమావేశ మందిరానికి చేరువలో వారికి ఓ గదిని కేటాయించి కార్యక్రమం ముగిసే వరకు తెరపై కార్యక్రమం వీక్షించే అవకాశం కల్పించారు. పలువురు భాజపా జిల్లాల అధ్యక్షులకు రెండు బృందాలుగా ఐఎస్‌బీ, ఇటు హెలిపాడ్‌ వద్ద ప్రధానిని కలిసే అవకాశం కల్పించారు.

గచ్చిబౌలిలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూలు (ఐఎస్‌బీ) వార్షికోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన తిలకిస్తున్న దృశ్యం

ఐఎస్‌బీ వార్షికోత్సవాల్లో భాగంగా ప్రత్యేక స్టాంప్‌ విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, చిత్రంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

-ఈనాడు, హైదరాబాద్‌;  న్యూస్‌టుడే, బేగంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని