Hyderabad: బేగంబజార్‌ హత్య కేసు: పోలీసు కస్టడీకి ఇద్దరు నిందితులు

బేగంబజార్‌లో యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది.

Published : 27 May 2022 18:09 IST

హైదరాబాద్‌: బేగంబజార్‌లో యువ వ్యాపారి నీరజ్‌ పన్వర్‌ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయ్, సంజన్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగిన నీరజ్ హత్య కేసులో షాహినాయత్ గంజ్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. 22వ తేదీన నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో విజయ్, సంజయ్, రోహిత్, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అభినందన్, మహేష్ పరారీలో ఉండటంతో మరుసటి రోజు వాళ్లిద్దరితో పాటు... మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 22న అరెస్టు చేసిన నలుగురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినా.. హత్యతో నేరుగా సంబంధం ఉన్న విజయ్, సంజయ్‌లను మాత్రమే కస్టడీకి అనుమతించింది.

విజయ్, సంజయ్‌లను ప్రశ్నించి హత్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. 22న అరెస్టు చేసిన అభినందన్, మహేష్, ప్రశాంత్‌లను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే వీళ్లను కూడా కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని