logo
Published : 28 May 2022 00:50 IST

Crime News: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఎస్సై మృతి

శామీర్‌పేట్‌: కుమార్తె పెండ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ రహదారి ప్రమాదంలో విశ్రాంత ఎస్సై దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన శామీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని యాకత్‌పూర ప్రాంతానికి చెందిన మహ్మద్‌ పాషా (61) సిద్దిపేట్‌ జిల్లా గజ్వేల్ పోలీసు స్టేషన్‌లో పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు. తన కుమార్తె వివాహం వచ్చే నెల 2న ఉండడంతో పెండ్లి పత్రికలు పంచేందుకు శుక్రవారం ద్విచక్ర వాహనంపై గజ్వేల్‌కు బయలుదేరారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం మజీద్‌పూర్‌ కూడలి వద్దకు రాగానే లారీని ఢీకొట్టారు. దీంతో పాషా అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని