logo

వాహనదారులకు ట్రాఫిక్‌ సమాచారం

రహదారులపై ట్రాఫిక్‌ జాంలు, సిగ్నళ్ల వద్ద పరిస్థితిపై పాదచారులు, వాహనదారులకు సమాచారం అందించే సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ కోరారు.

Published : 28 May 2022 01:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రహదారులపై ట్రాఫిక్‌ జాంలు, సిగ్నళ్ల వద్ద పరిస్థితిపై పాదచారులు, వాహనదారులకు సమాచారం అందించే సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ కోరారు. సిగ్నళ్ల వ్యవస్థ, ట్రాఫిక్‌జాంల పరిష్కారాలపై శుక్రవారం ఆయన ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూంలో ఐబీఐ సంస్థ, తెలంగాణ సాంకేతిక సేవల విభాగం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ట్రాఫిక్‌జాంలు, అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలను వాహనదారులకూ చేరేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని