logo

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మనబస్తీ.. మన బడి కార్యక్రమంలో....

Published : 28 May 2022 01:23 IST


పాఠశాలను పరిశీలిస్తున్న మంత్రులు సబితారెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మనబస్తీ.. మన బడి కార్యక్రమంలో భాగంగా పైలెట్‌ పద్ధతిన నగరంలోని అలియా ప్రభుత్వ మోడల్‌ పాఠశాలలో చేపట్టిన పనులను శుక్రవారం మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో సబితారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాల ముద్రణ దాదాపుగా పూర్తయ్యిందని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, అంజయ్యయాదవ్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని