logo
Published : 28 May 2022 07:15 IST

వితంతువును వదలని ప్రేమోన్మాది

పెళ్లికి నిరాకరించిందని హత్యాయత్నం


రోడ్డుపై పడిపోయిన నూర్‌బాను

కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే: వితంతు మహిళను ప్రేమోన్మాది విచక్షణరహితంగా కత్తితో పలుమార్లు పొడిచాడు. ఆమె ఒవైసీ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. కంచన్‌బాగ్‌ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కంచన్‌బాగ్‌ డివిజన్‌ హఫిజ్‌బాబానగర్‌లోని మస్జిద్‌-ఏ-సాలేహీన్‌ పరిసర ప్రాంతాల్లో నివసించే నూర్‌బాను భర్త ఇంతియాజ్‌ రెండేళ్ల క్రితం మరణించారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. వీరి ఇంటి సమీపంలో తెరాస నాయకుడిగా చలామణి అవుతున్న అవివాహితుడు షేక్‌ నసీరుద్దీన్‌ అలియాస్‌ హబీబ్‌ గత ఏడాది నూర్‌బానును పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి తెచ్చాడు. నిరాకరించినా వెంటపడి వేధిస్తున్నాడు. ఆమె గత ఏడాది కంచన్‌బాగ్‌ పోలీసులను ఆశ్రయించారు. హబీబ్‌పై కేసు నమోదు చేసి హెచ్చరించి విడిచి పెట్టారు. అతను ఇటీవల మళ్లీ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు ఇరు కుటుంబాలకు చెప్పింది. దీంతో అతను పగ పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మనుమరాలు అనారోగ్యంగా ఉందన్న సమాచారం మేరకు ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. బైకుపై హబీబ్‌ వెంబడించాడు. వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో ఒమర్‌ హోటల్‌ వద్ద నూర్‌బానును 7-10 సార్లు పొడిచాడు. బైకును వదిలి పారిపోయాడు. పోలీసులు.. క్షతగాత్రురాలిని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సాయిరామ్‌ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


షేక్‌ నసీరుద్దీన్‌

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని