logo

చలో నేపాల్‌!

అంతర్జాల ఆధారిత నేరాలు.. యాప్‌ల ద్వారా రుణాలు.. రూ.లక్షలకే ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులు పోలీసుల నుంచి తప్పించునేందుకు నేపాల్‌కు పారిపోతున్నారు.

Published : 28 May 2022 01:51 IST

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరస్థుల పన్నాగం

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాల ఆధారిత నేరాలు.. యాప్‌ల ద్వారా రుణాలు.. రూ.లక్షలకే ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులు పోలీసుల నుంచి తప్పించునేందుకు నేపాల్‌కు పారిపోతున్నారు. సరిహద్దుల్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న శశస్త్రసీమ్‌బల్‌ దళం, నేపాల్‌లోని స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారు. అలా అశోక్‌ షాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం నేపాల్‌-భూటాన్‌ సరిహద్దులో అరెస్ట్‌ చేశారు. మరికొందరు సైబర్‌ నేరస్థులు అక్కడి గ్రామాల్లో ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మెట్రోనగరాల్లో యువత, వృత్తినిపుణులే లక్ష్యంగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడి నేపాల్‌కు ప్రైవేటు బస్సులు, విమానాల్లో పారిపోతున్నారు. ఇందుకు నకిలీ ఆధార్‌ కార్డులు, చరవాణులు వాడుతున్నారు. పాస్‌పోర్టు, వీసా అవసరం లేకపోవడం వారికి కలిసొచ్చింది. మరికొందరు నిందితులు పర్యాటకుల్లా వెళ్లి అక్కడే 2 నెలలపాటు ఉంటున్నారు. యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనీయులు కూడా నేపాల్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు