logo

139 మందిపై పీటీ వారెంట్‌

సైబర్‌ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు జైలు శిక్షలే సరైన పరిష్కారంగా పోలీసులు భావిస్తున్నారు. మాయగాళ్ల నేరాలను న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేసేందుకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారు.

Published : 28 May 2022 02:03 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు జైలు శిక్షలే సరైన పరిష్కారంగా పోలీసులు భావిస్తున్నారు. మాయగాళ్ల నేరాలను న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేసేందుకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక కేసులో అరెస్టైన వారికి ఇతర కేసుల్లో ప్రమేయం ఉంటే సైబర్‌క్రైమ్‌, ఆయా ఠాణాలు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే 139 మంది సైబర్‌ నిందితులపై పీటీ వారెంట్‌ దాఖలు చేసినట్టు సమాచారం. ప్రతి కేసులోనూ నిందితులను వేర్వేరుగా అరెస్ట్‌ చేయటంతో నిందితులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లోనే 6-7 నెలల సమయం ఉండాల్సి వస్తోంది. అన్ని కేసుల్లోనూ వీలైనంత త్వరితగతిన ఛార్జిషీటు దాఖలు చేసి శిక్షలు పడేలా న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని