logo

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. కండక్టర్‌ తొలగింపు

ప్రయాణికురాలితో కండక్టర్‌ తప్పుగా వ్యవహరించడంతో ఆయనను విధుల నుంచి బహిష్కరించారు. జనవరి 4న బర్కత్‌పురా డిపోకు చెందిన కండక్టర్‌ శివకుమార్‌ విద్యార్థినితో అసభ్యంగా వ్యవహరించాడు.

Published : 28 May 2022 02:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికురాలితో కండక్టర్‌ తప్పుగా వ్యవహరించడంతో ఆయనను విధుల నుంచి బహిష్కరించారు. జనవరి 4న బర్కత్‌పురా డిపోకు చెందిన కండక్టర్‌ శివకుమార్‌ విద్యార్థినితో అసభ్యంగా వ్యవహరించాడు. ఈ విషయమై ఆ అమ్మాయి నేరుగా ఎండీ సజ్జనార్‌కి ఫిర్యాదు చేయడంతో విచారించిన అనంతరం ఆయనను విధులనుంచి తప్పించారు. ఈ మేరకు బర్కత్‌పురా డిపో మేనేజర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని