logo

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతికి అసభ్య సందేశాలు

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించి పెళ్లి నిశ్చయమైన యువతితో పాటు అబ్బాయి కుటుంబ సభ్యులకు అనుచిత సందేశాలు పంపిన యువకున్ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం....

Published : 28 May 2022 02:58 IST

కీసర, న్యూస్‌టుడే: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించి పెళ్లి నిశ్చయమైన యువతితో పాటు అబ్బాయి కుటుంబ సభ్యులకు అనుచిత సందేశాలు పంపిన యువకున్ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.... వికారాబాద్‌కు చెందిన జాతావత్‌ సిద్దు(22) కీసరలోని సిద్ధార్థనగర్‌కాలనీలో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి మరొకరితో వివాహం నిశ్చయమైంది. ఎలాగైనా ఆమె పెళ్లి రద్దు చేయాలనే పథకం పన్నాడు. యువతి పరువు తీసేందుకు నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ ఐడీని సృష్టించాడు. అమ్మాయి బంధువులతో పాటు కాబోయే పెళ్లి కొడుకు ఫోన్‌ నంబరుకు అవమానకరమైన, అసభ్యకరమైన సందేశాలతో పోస్ట్‌ చేశాడు. అమ్మాయిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని దూరం చేసేందుకు కుటుంబ సభ్యులకు సందేశాలు పంపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని సాంకేతిక ఆధారాలను సేకరించి, డేటాను విశ్లేషించిన తర్వాత విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని