logo
Updated : 28 May 2022 16:25 IST

Hyd News : నానక్‌రాంగూడలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

రాయదుర్గం : నానక్‌రాంగూడలోని గ్రాండ్‌ స్పైసీ బావర్చి హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి హోటల్‌లోని జనం, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంతో హోటల్‌ పరిసరాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని హోటల్‌ సిబ్బంది చెబుతున్నారు.

మొదట భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్‌ గార్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బందికి కేటాయించిన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 14 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్కై లిఫ్ట్‌ ద్వారా కిందకి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బందిపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పారు.

ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే.. ఇంకా భవనంలో ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలిస్తున్నారు. రెండో అంతస్తులో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించినట్లు అగ్ని మాపక సిబ్బంది చెప్పారు. మంటలు వ్యాపించగానే రెండో అంతస్తులోని వారు కిందికి పరుగు తీయగా.. పై అంతస్తుల్లో ఉన్న వారంతా టెర్రస్‌పైకి చేరుకున్నట్లు చెప్పారు. స్కై లిఫ్ట్‌ సాయంతో టెర్రస్‌పైన ఉన్నవారిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు వివరించారు. సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించి.. భారీ స్కై లిఫ్ట్‌ సాయంతో  సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.


Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని