Hyderabad: హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు సవరించిన తెలంగాణ ప్రభుత్వం

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి నివాస భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు సవరించింది.

Published : 28 May 2022 20:35 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి నివాస భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు సవరించింది. జీహెచ్‌ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు కూడా 24 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించనుంది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఆర్‌ఏ పెంపుపై టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాత పద్ధతిలో హెచ్‌ఆర్‌ఏను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పెండింగ్‌ పీఆర్సీ జీవోలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని