logo

అన్నను చంపిన కేసులో తమ్ముడి రిమాండ్‌

అన్నను చంపిన కేసులో తమ్ముడిని కొడంగల్‌ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ రషీద్‌, డీఎస్‌పీ శ్రీనివాస్‌ హైవే పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

Published : 29 May 2022 01:52 IST

వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పీ రషీద్‌, డీఎస్‌పీ శ్రీనివాస్‌

కొడంగల్‌, న్యూస్‌టుడే: అన్నను చంపిన కేసులో తమ్ముడిని కొడంగల్‌ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ రషీద్‌, డీఎస్‌పీ శ్రీనివాస్‌ హైవే పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్ల గ్రామ శివారులోని దుసరకుంటలో గతేడాది నవంబరు 18న ఓ శవం కనిపించింది. కుంట గట్టుపై కనిపించిన దుస్తులు, చెప్పుల ఆధారంగా ఏర్పుమల్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్‌గా గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.గోపాల్‌కు తమ్ముడు పూజారి శ్రీను భార్యతో అక్రమ సంబంధం ఉందని గతంలో గొడవలు జరిగినట్లు విచారణలో తెలిసింది. అనంతరం కొన్ని రోజులకే భార్యా పిల్లలతో శ్రీను హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఇతనిపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. అన్న మద్యానికి బానిస కావడంతో వదిన వదిలేసి వెళ్లిపోయిందని, ఇదే సమయంలో తన భార్యతో అన్న వివాహేతర సంబంధ]ం పెట్టుకున్నాడని అనుమానించాడు. 2021 నవంబరు 15న రాత్రి గోపాల్‌ ఇంటికి వెళ్లి హత్య చేసినట్లు శ్రీను తెలిపాడు. శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి దుసరకుంటలో పడేసినట్లు పేర్కొన్నాడు. సీఐ ఇఫ్తాకార్‌ ఆహ్మద్‌, ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని