logo

వెయ్యి కిలోల నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం

నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలలో టన్ను నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాటి విలువ దాదాపు 20లక్షల వరకూ ఉంటుందని అంచనా.  వివరాలను  శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి, బాలానగర్‌ డీసీపీ

Published : 29 May 2022 02:01 IST

ఎం.అంజప్ప

శంషాబాద్‌, జీడిమెట్ల, న్యూస్‌టుడే: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలలో టన్ను నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాటి విలువ దాదాపు 20లక్షల వరకూ ఉంటుందని అంచనా.  వివరాలను  శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి, బాలానగర్‌ డీసీపీ సందీప్‌ వేర్వేరుగా వెల్లడించారు. శంషాబాద్‌ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కర్నూల్‌, నంద్యాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న  570 కిలోల నకిలీ పత్తి విత్తనాలను శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలమాకుల వద్ద పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎం.అంజప్ప, పి.సుభాశ్‌, పి.శేఖర్‌, మనోహర్‌రెడ్డి కలిసి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాలలో ప్రభుత్వ అనుమతి లేకుండా సేకరించిన నకిలీ పత్తి విత్తనాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు వచ్చి దొరికిపోయారు. పట్టుబడిన అంజప్పను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  మరో కేసులో బాలానగర్‌ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం కరీంనగర్‌ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన మూల హరీశ్‌ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. గతంలో అతడికి ఓ విత్తనాల సంస్థలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. కొన్నాళ్లకు నకిలీ దందాకు తెరలేపాడు. 400 కిలోల విత్తనాల్ని ఓ వాహనంలో తీసుకొస్తుండగా ఎస్వోటీ, దుండిగల్‌ పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. హరీశ్‌, డ్రైవర్‌ హరిప్రసాద్‌ పట్టుబడగా అలిషా పరారయ్యాడు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని