logo

సావర్కర్‌ చిత్ర కళాఖండం ప్రదర్శనపై యువజన కాంగ్రెస్‌ నిరసన

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో పాటు  వీరసావర్కర్‌ చిత్రపటాన్ని ప్రదర్శనగా ఏర్పాటు చేయడం పట్ల శనివారం మ్యూజియం ప్రవేశ ద్వారం

Published : 29 May 2022 02:01 IST

యువజన కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో పాటు  వీరసావర్కర్‌ చిత్రపటాన్ని ప్రదర్శనగా ఏర్పాటు చేయడం పట్ల శనివారం మ్యూజియం ప్రవేశ ద్వారం ముందు  యువజన కాంగ్రెస్‌ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోతా రోహిత్‌ ఆధ్వర్యంలో నేతలు శైలేందర్‌, సాయితేజ, నరేశ్‌, వెంకట్‌, భాస్కర్‌ తదితరులు నిరసన చేపట్టి సావర్కర్‌ చిత్ర కళాఖండాన్ని తొలగించాలన్నారు. సావర్కర్‌ బ్రిటీష్‌ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి.. వారికి విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేశారని.. అలాంటి వ్యక్తి ఫొటో కళాఖండాన్ని ఏర్పాటు చేయడం భారతీయులను అవమానించడమేనని రోహిత్‌ విమర్శించారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని